‘ఆదిపురుష్’ టీజర్ వచ్చేది అప్పుడేనా…?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి చిత్రాల్లో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. ప్రభాస్ కి ఈ సినిమా బాలీవుడ్ స్ట్రైట్ మూవీ కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుండగా.. రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్ కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి టీజర్‌గానీ, ఫస్ట్ లుక్‌గానీ రిలీజ్ చేయలేదు మూవీ మేకర్స్. దాంతో ఆది పురుష్‌లో ప్రభాస్ రాముడిగా ఎలా కనిపిస్తాడా.. అని ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 10న ‘ఆదిపురుష్’ సినిమా నుంచి ప్రభాస్ లుక్ లేదా టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. దాంతో ప్రభాస్ రాముడి అవతారం కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.