Dasara: దసరా నుండి ఛమ్‌కీలా అంగీ సాంగ్ విడుదల
Dasara: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నాని ,మహానటి కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా దసరా. త్వరలోనే దసరా తో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. దసరా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు అలాగే విడుదల చేసిన రెండు పాటలకు సినీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మూడవ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఈ సినిమా నుంచి ‘చెమ్కీలా అంగీలేసి’ అనే ఫుల్ సాంగును రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, ధీ – రామ్ మిర్యాల ఆలపించారు. తెలంగాణ జానపదాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు కొరియోగ్రఫర్ రక్షిత్ శెట్టి నృత్యరీతులు సమకూర్చాడు. పల్లెటూరి యాసలో నాని గురించి కీర్తిసురేశ్ పాడుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. దసరా చిత్రానికి ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలువడం ఖాయమనిపిస్తోంది. సింగరేణి బొగ్గు గని విలేజ్ బ్యాక్‌డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అవుతుంది.