Ram Pothineni: బాక్సాఫీస్ వద్ద ‘ది వారియర్’ కలెక్షన్స్
The Warriorr Movie Collections:ఉస్తాద్ రామ్ పోతినేని,కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ది వారియర్’. ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత రామ్ మాస్ కంటెంట్లతో నే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ది వారియర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తర్వాత రెండో రోజు మాత్రం మౌత్ టాక్ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించినా…వసూళ్లు కొంచం నెమ్మదించాయి అని తెలుస్తుంది.
భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అయితే సినిమా రిలీజ్ కు ముందున్న భారీ హైప్ తో తొలిరోజున మ్యాచ్ చేయగలిగింది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా షేర్ వసూళ్లలోకేవలం రూ.8 కోట్ల మేరనే రాబట్టింది.
రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 2.5 కోట్ల నుండి 2.7 కోట్ల దాకా కలెక్షన్స్ ని సాధించింది. టికెట్ రేట్స్ ని తగ్గించి ఉంటె ఆఫ్ లైన్ బుకింగ్స్ మరింత జోరుగా సాగి ఉండేవి కానీ అలా జరగలేదు. ఇవి ఎక్కువగా ఆన్ లైన్ ద్వారా వచ్చినవి మాత్రమే ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2వ రోజున సినిమా 2.63 కోట్ల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది.
సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 39 కోట్ల రేంజ్లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 28.35 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.