150 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న ‘కళావతి’
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం “సర్కారువారి పాట”. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 12 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన కళావతి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సాంగ్ ఇప్పుడు 150 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో రీల్స్ సైతం భారీ గా వచ్చాయి. ఇకపోతే ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. త్వరలోనే మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మరి ఆ సాంగ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.