వారణాసిలో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ప్రత్యేక పూజలు.. ఫోటో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ త్రయం వారణాసిలో సందడి చేశారు.
రోమన్ లో ఉన్నప్పుడు రోమన్ లానే ఉండాలి అన్నట్లుగా.. ఆర్ఆర్ఆర్ త్రయం ఎక్కడ ఉంటే అక్కడి డ్రెస్సింగ్ స్టైల్ ని ఫాలో అవుతున్నారు. నిన్నటికి నిన్న అమృత్ సర్ లో తలకు క్లాత్ కట్టుకొని నది ఒడ్డున ప్రార్థనలు చేసిన ఈ బృందం.. వారణాసిలో హిందూ సాంప్రదాయంకు తగ్గట్టు సాంప్రదాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.