Suchitra Chandrabose: కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ కు పితృ వియోగం
Choreographer Suchitra Chandrabose Father Passes Away: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. జాతీయ స్థాయిలో అయితే ఎంతో గుర్తింపు ఉన్న ప్రముఖ వెటరన్ డాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా కన్నుమూశారు.చాంద్ బాషా వయసు 92. రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు..చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేసారు.
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మామ చాంద్ బాషా. చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం , మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.