Chiranjeevi: తాత పాటకు చిందేసిన మనవరాలు..
Chiranjeevi’s Granddaughter Danced To The Song Boss Party: మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు వచ్చినవారందరు హీరోలే. నిలదొక్కుకున్నారా.. లేదా అని పక్కనపెడితే ఇప్పటివరకు వచ్చినవారందరు బాగానే కష్టపడుతున్నారు. ఇక మెగా ప్రిన్సెస్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారికకు మాత్రం లక్ కలిసిరాలేదు. రెండు మూడు సినిమాలు చేసినా అమ్మడిని ఎవరు హీరోయిన్ గా పట్టించుకోకపోయేసరికి ఎంచక్కా పెళ్లి చేసుకొని నిర్మాతగా మారింది. ఇక ప్రస్తుతం చిరుకు మనవరాళ్లే ఎక్కువ.. వారిలో ఎవరైనా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా మెగా వారసత్వం కంటిన్యూ అవుతోంది. గత కొన్ని రోజుల నుంచి చిరు పెద్దకూతురు సుస్మిత గారాలపట్టి సంహిత టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఆ వార్తలను నిజంచేసేలా ఈ చిన్నది తన తాత సాంగ్ కు స్టెప్పులు వేసి అదరగొట్టింది. దట్టమైన మంచు కొండల మధ్య శేఖర్ మాస్టర్ తో కలిసి బాస్ వేర్ ఈజ్ ది పార్టీ అంటూ చిందులు వేసింది. ఇక దీంతో సంహిత నటనలోకి దిగే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల కానుంది.. ఈ సినిమా నుంచి రిలీజైన బాస్ వేర్ ఈజ్ ది పార్టీ ఎంత రచ్చ రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. సాంగ్ అయితే ఓకే మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్నిరోజులు ఆగక తప్పదు అంటున్నారు అభిమానులు.