Chiranjeevi: అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Chiranjeevi Wished His Fans Happy Sankranti: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, కోడి పందాలతో గ్రామాలూ కళకళలాడుతున్నాయి. మరోపక్క ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ కూడా వరుస సినిమాలతో కళకళలాడుతోంది. తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు సినిమాలు సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ మూడు రోజులు సినీ అభిమానులకు పండుగే పండుగ.
ఇక నేడు సంక్రాంతి కావడంతో ప్రముఖులు.. అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. “అందరికీ పచ్చ తోరణాల, ముంగిట ముగ్గుల, మకర సంక్రాంతి శుభాకాంక్షలు! సంవత్సరం పొడుగునా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, పాడి పంటలు, భోగ భాగ్యాలు ‘LOADING ‘ అవుతూనే వుండాలి.. హ్యాపీ సంక్రాంతి ” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
అందరికీ పచ్చ తోరణాల, ముంగిట ముగ్గుల, మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
సంవత్సరం పొడుగునా అందరి జీవితాల్లో
సుఖ సంతోషాలు, పాడి పంటలు,
భోగ భాగ్యాలు 'LOADING ' అవుతూనే వుండాలి !💐💐 #HappySankranti— Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2023