Chiranjeevi: అందుకే చిరంజీవిని ఇండస్ట్రీ పెద్ద అనేది..
Chiranjeevi Talking About VeeraSimha Reddy At Waltair Veerayya Pre Release Event: ఏ రంగంలో అయినా అందరు బావుండాలి అని కోరుకొనేవాడే నాయకుడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నిలబడే వాడే పెద్ద దిక్కుగా మారతాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఎవరు అంటే చిరంజీవి అని చెప్పుకొచ్చేస్తారు. ఇండస్ట్రీలో సమస్య ఏదైనా చివరికి పరిస్కారం మాత్రం చిరునే. అది ప్రత్యక్షంగానా, పరోక్షంగానా అన్నది సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. అందరి సినిమాలు ఆడాలి, ఇండస్ట్రీ బావుండాలి, బాక్సాఫీస్ కళకళలాడాలి. ముఖ్యంగా ప్రేక్షకులు థియేటర్లకు రావాలని చిరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు.
సాధారణంగా ఒక స్టార్ హీరో.. తన ఫంక్షన్ లో వేరొక హీరో సినిమా ఆడాలని, బాగా కలక్షన్స్ రావాలని కోరుకోడు. కానీ.. ఒక్క మెగా ఫ్యామిలీ మాత్రమే ప్రతి ఫంక్షన్ లో తమ సినిమాతో పాటు ఇతర సినిమాలు కూడా ఆడాలని,వారికి మంచి పేరు రావాలని ఆలోచిస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే.. చిరు నుంచే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఎంత లేదు అనుకున్న స్టార్ హీరోల మధ్య పోటీ ఉంది అంటే మా సినిమా బాగా ఆడాలి, ఎదుటివారి సినిమా పోవాలి అనే కోరుకుంటారు. కానీ, చిరు మాత్రం ఇండస్ట్రీ బావుండాలి. అది బావుండాలి అంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అని కోరుకుంటారు. అందుకు నిదర్శనమే.. నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ సినిమాకు పోటీగా వస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా హిట్ అవ్వాలని ఆయన కోరుకోవడం. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ పరిశ్రమలో మంచి విజయం అందుకోవాలని, వాల్తేరు వీరయ్య- వీరసింహారెడ్డి చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఇదే తొలిసారి అని నిర్మాతలకు తమ ఎంపికలపైనా కంటెంట్ పైనా నమ్మకం ఉందని చిరు అన్నారు. ఇలా చెప్పడం కేవలం చిరుకు మాత్రమే సాధ్యమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీ గురించి ఆలోచించేవాడినే ఇండస్ట్రీ పెద్ద అంటారు.. అందుకే చిరునే ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇండస్ట్రీ పెద్ద అని తనను పిలవొద్దని.. తానెప్పుడూ కళమ్మా తల్లి ముద్దుబిడ్డనే అని చిరు చెప్పుకు రావడం విశేషం. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.