Chiranjeevi: దేశం గర్వించదగిన నటుడు అమీర్ ఖాన్..
Chiranjeevi Talking About Aamir khan: అమీర్ ఖాన్ దేశం గర్విచదగ్గ నటుడని మెగాస్టార్ ప్రశంసించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ ఈ చిత్రం ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక ఈ వెంత్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. తెలుగులో ఈ సినిమాను చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ వేదికపై చిరు అమీర్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అమీర్ దేశం గర్వించదగ్గ నటుడని, ఆయనలా ఉండే హీరో ఇండియాలో ఒక్కరు కూడా లేరని తెలిపారు. అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్ లు తాను చేయలేనని, తనవరకు తాను అభిమానులు జేజేలు కొట్టేవి మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ నడక, నడవడిక, వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం అన్న చిరు ఇండియాలో అంత అద్భుతంగా నటించ గల నటుడు అమీర్ ఖాన్ ఒక్కడే అని ప్రశంసించారు. అమీర్ సినిమా కోసం కష్టపడతాడని, ఈ సినిమాకు ఎన్నో వర్క్ షాప్స్ ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సినిమా కి తాను అమీర్ అడిగారు అని కాకుండా ప్రేమతో భాగమయ్యానని, అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయని చెప్పుకొచ్చారు. తాను సమర్పిస్తున్న సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుందని చమత్కరించారు.