Chiranjeevi: పాపం.. ఇక కొరటాలను వదిలేయవయ్యా చిరు
Chiranjeevi Setairs On Koratala Shiva: ఆచార్య పరాజయాన్ని చిరంజీవి జీర్ణించుకోలేకపోతున్నాడా..? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. అసలు ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం చిరంజీవి అంటదు కొరటాల.. కొరటాల వలనే సినిమా పోయిందని చిరు చెప్పుకొస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలియదు కానీ, మీడియా ముందు ఇన్ డైరెక్ట్ గా మాత్రం ఒకరికి ఒకరు కౌంటర్లు వేసుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లోనూ కొరటాల పై కౌంటర్లు వేశారు. చిన్నా, పెద్ద డైరెక్టర్లు ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటే.. సినిమా బడ్జెట్ ను, సమయాన్ని అదుపులో పెట్టుకొని సినిమా ప్రేక్షకులకు ఇచ్చేవాడే డైరెక్టర్.
నేను మొదటి హిట్ కొత్తగా.. నేను రాసిన కథలు హిట్ అయ్యాయి.. అంటే.. అందుకు తగ్గట్టు మరో హిట్ సినిమాను ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా కొరటాలకు కౌంటర్లు వేశాడు. ఇక ఇంకోవైపు కొరటాల.. హీరోల జోక్యం వలనే కథలు మారిపోతున్నాయి అని, ప్రతి చిన్న విషయం వారికి చెప్పి, వారి అనుమతి తీసుకొని మార్చాలంటే చాలామంది వారితో చేయడానికి భయపడుతున్నారని చెప్పుకొస్తున్నారని అన్నాడు. నిజం చెప్పాలంటే చిరు.. ఏ ముహర్తనా కొరటాలపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాడో కానీ.. ఇప్పటివరకు అతడి నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళిందే లేదు. అతడిపై నెగెటివిటి వచ్చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాపైనే అతడి ఆశలు ఉన్నాయి.ఇక ఇప్పుడైనా కొరటాల ను వదిలేయవయ్యా చిరు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఇది కూడా ప్లాప్ అయ్యిందా..?కొరటాల పని ఇంకా అంతే సంగతులు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ తెప్పిస్తాడో చూడాలి.