Chiranjeevi: నా జీవితాన్ని ప్రభావితం చేసిన ఇద్దరు ఆడవారు వీరే
Chiranjeevi Posts A Lovely Pic Of Himself With Mother And Wife: ఏ మగాడికైనా తల్లి, భార్య, చెల్లి, అక్క ను మించిన సపోర్ట్ ఏం ఉంటుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. అది అక్షరాలా నిజం. ఎంత గొప్ప స్థాయికివెళ్లినా వారి వెనుక ఎవరో ఒక మహిళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు. తన జీవితంలో ఆ ఇద్దరే నన్ను ప్రభావితం చేసారని చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. నేడు మహిళా దినోత్సవం కావడంతో తన జీవితంలో ఉన్న అత్యంత ప్రభావితం చేసిన ఆడవారి గురించి చెప్పుకొచ్చాడు.
“ప్రపంచంలోని మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రపంచంలో తమ సరైన స్థానాన్ని పొందేందుకు పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలు అందరికీ వందనం. భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం. నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరిద్దరే” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆయన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే భోళా శంకర్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.