కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్న చిరంజీవి, బాలకృష్ణ మధ్య వ్యక్తిగతంగా స్నేహసంబంధాలున్నప్పటికీ.. అభిమానుల మధ్య మాత్రం వైరం కొనసాగుతూనే ఉంది.
Telugu film industry : కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో (Telugu film industry)అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్న చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) మధ్య వ్యక్తిగతంగా స్నేహసంబంధాలున్నప్పటికీ.. అభిమానుల మధ్య మాత్రం వైరం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే భోళాశంకర్ (Bholashankar)రూపంలో చిరంజీవికి భారీ డిజాస్టర్ ఎదురైంది. అయితే ఆచార్య కన్నా కొంచెం పర్వాలేదని, బానేవుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు ట్రోలర్స్‌కు అడ్డంగా దొరికిపోయింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో(Fans Social Media) ట్రోల్ చేయడంతో మెగా అభిమానులు చాలా అవమానంగా ఫీలయ్యారు. సినిమా ఫలితంకన్నా ఆ ట్రోలింగ్‌కు మెగా అభిమానులు ఎక్కువగా బాధపడ్డారు.
తాజాగా వీరి దృష్టి మరోసారి బాలకృష్ణపై పడింది. కొంతమంది ఒక బృందంగా ఏర్పడి స్కంద ఈవెంట్‌ను పరిశీలించారు. ఆ వేడుకలో బాలకృష్ణ సరదాగా చేసిన పనులను అవసరమైనచోట కట్ చేసి ఆ క్లిప్స్‌తో బాలయ్యను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు ఒకటి పరిశీలిస్తే..బాలకృష్ణ మాట్లాడుతుండగా శ్రీలీల నవ్వు ఆపుకుంటున్నట్లుగా ఒక వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి భగవంత్ కేసరి సినిమావల్ల బాలయ్య, శ్రీలీల ఇద్దరూ క్లోజ్ అయ్యారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు, క్యాన్సర్ ఆసుపత్రి ఈవెంట్‌కు శ్రీలీల హాజరైంది. స్కంద ఫంక్షన్లో బాలకృష్ణ రామ్‌ను సరాదాగా టీజ్ చేస్తారు. అయితే అది రామ్ మీద బాలయ్య ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లుగా వీడియో వైరలవుతోంది. అయితే అదే వేడుకలో రామ్, బాలయ్య ఇద్దరూ సరదాగా గడిపారు.
ఒకరకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో మెగా అభిమానులు విజయవంతమయ్యారని చెప్పవచ్చు. భగవంత్ కేసరిని మెగా అభిమానులు తర్వాత ఎలాగైనా టార్గెట్ చేస్తారు. కాబట్టి అలా అవకుండా కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.