Unstoppable 2: మొదటి గెస్ట్ గా చిరంజీవి..?
Chiranjeevi Confirms In Balakrishna Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 పై అందరూ సర్వత్రా ఆసక్తిని చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీజన్ 2 మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆహా ఓటిటీలో మొదలైన ఈ టాక్ షో సీజన్ 1 ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక త్వరలోనే సీజన్ 2 మొదలు కానుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
అన్ స్టాపబుల్ సీజన్ 1 మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబుతో బాలయ్య ఆడి పాడి సందడి చేసిన విషయం తెల్సిందే. మొదటి ఎపిసోడ్ తోనే అభిమానుల అంచనాలను తారుమారు చేయడానికి నిర్వాహకులు మోహన్ బాబు ఫ్యామిలీ తో షో స్టార్ట్ చేశారు. అనుకున్నట్లుగానే మొదటి ఎపిసోడ్ అల్టిమేట్ రేటింగ్ తీసుకొచ్చి పెట్టింది. దీంతో ఇదే స్ట్రాటజీ ని సీజన్ 2 లో కూడా ఫాలో అవుతున్నారట.
బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఖచ్చితంగా చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు. బాలయ్య మరియు చిరంజీవి ఎపిసోడ్ కోసం తెలుగు ఓటీటీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ ఆహా టీమ్ వారు చెబుతున్నారు.
సీజన్ 2 మొదటి గెస్ట్ గా చిరంజీవి ని ఆహ్వానిస్తే రేటింగ్ అదిరిపోతోందని, సీజన్ మొత్తం విజయవంతం అవుతుందని అనుకోని చిరును ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఇదే కనుక నిజమైతే బాలకృష్ణకు-చిరంజీవికి మధ్య ఉన్న విబేధాల గురించి చర్చ జరుగుతుందా..? వాటి గురించి చిరు నోరు విప్పుతాడా..? అనేది అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.