ఆదివారం సాయంత్రం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతిచెందిన విషయం తెల్సిందే. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతిచెందిన విషయం తెల్సిందే. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రాజ్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజ్- కోటి ద్వయం.. వారు ఇచ్చిన హిట్ సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేనివి. అలాంటి ద్వయంలో ఇప్పుడు ఒకరు లేరు అని తెలియడంతో మనసు ముక్కలవుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రాజ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. రాజ్ మృతిపై ఎమోషనల్ అయ్యారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలకు రాజ్- కోటి ద్వయం మ్యూజిక్ ను అందించారు. నిజం చెప్పాలంటే చిరు- రాజ్- కోటి కాంబో అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక ఆ అనుబంధతోనే చిరు.. రాజ్ మృతిపై ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రాజ్ మృతి పట్ల సంతాపం తెలియచేశారు.
“ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో ‘రాజ్’ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ… pic.twitter.com/uPifYfmtFE
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2023