MM Keeravani: గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్రముఖుల ప్రశంసలు
Celebrities Congratulated To Historical RRR Got First Award In Golden Globes: అనుకున్నట్టుగానేఆర్ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. ఆస్కార్ తర్వాత అత్యంత గౌరవప్రదమైన అంతర్జాతీయ పురస్కారంగా పేరు దక్కించుకున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో కీరవాణి స్వరపరిచిన నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు సొంతమయింది.దీంతో ఇండియాలో వేడుకలు మొదలయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్ర ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా విడుదలైన దగ్గరనుంచి ఏదో ఒక అవార్డు ను అందుకుంటూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెల్సిందే. ఇక అంతకన్నా ముందే మరో అత్యున్నత స్థాయి అవార్డును ఈ చిత్ర సొంతం చేసుకోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ అవార్డు దక్కడం పట్ల కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. నాటు నాటు కి అవార్డు వచ్చిందంటూ ప్రకటించిన వెంటనే రాజమౌళితో పాటు ఎన్టీఆర్ చరణ్ అంతా కూడా చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఇక ఇంత గొప్ప అవార్డు అందుకున్న కీరవాణి కి, ఆర్ఆర్ఆర్ బృందానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసల తో ముంచెత్తుతున్నారు.
తాజాగా ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు జెండా ఉన్నత స్థాయికి ఎగురుతోంది. అందరప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరి తరుపున కీరవాణి గారికి, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిమ్మల్ని చూసి మేము ఎంతగానో గర్విస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి సైతం ఆర్ఆర్ఆర్ బృందాన్ని మెచ్చుకున్నారు. ” ఎంతటి అసాధారణమైన, చారిత్రాత్మకమైన విజయం. గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఎమ్ఎమ్ కీరవాణి గారికి టేక్ ఏ బౌ.. చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని, రాజమౌళిని చూసి ఇండియా గర్వ పడుతోంది. నాటు నాటు సాంగ్ మొత్తం సంగీతం, నాట్యం కలగలిపిన వేడుక. ఈ పాటకు నేడు ఇండియాతో పాటు ప్రపంచం మొత్తం మీతో డ్యాన్స్ వేస్తోంది. కుడోస్ తారక్, చరణ్.. బోస్ గారి లిరిక్స్ అద్భుతం. కాల భైరవ, రాహుల్ వాయిస్ మెస్మరైజ్ చేసాయి” అని చెప్పుకొచ్చారు.
#NaatuNaatu is all about the celebration of Music 🎶 & Dance 🕺
India & the World is dancing with you today!!Kudos @tarak9999 @AlwaysRamCharan @boselyricist for the fabulous lyrics!@kaalabhairava7 @Rahulsipligunj
Danayya garu @DVVMovies @goldenglobes #GoldenGlobes pic.twitter.com/U77CjQclyC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023