Dimple Hayathi:ఐపీఎస్ (IPS) అధికారి కారుని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారుని తన్నడమే కాకుండా నానా హంగామా చేసిందనే ఆరోపణల నేఫథ్యంలో హీరోయిన్ డింపుల్ హయాతీపై జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది.
Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతీపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీఎస్ (IPS) అధికారి కారుని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారుని తన్నడమే కాకుండా నానా హంగామా చేసిందనే ఆరోపణల నేఫథ్యంలో హీరోయిన్ డింపుల్ హయాతీపై జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీఎస్ కారుని ఢీకొడమే కాకుండా వీరంగం చేసిందదంటూ ఎఫ్ ఐ ఆర్‌లో పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఉంటున్న హుడా ఎన్క్లేవ్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఈ ఘటన జరిగింది.
హుడా ఎన్ క్లేవ్‌లోని అపార్ట్మెంట్లో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఉంటున్నారు. ఇదే అపార్ట్మెంట్లో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటోంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కార్ పార్కింగ్ స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు డేవిడ్ బీఎండబ్ల్యూ కార్ పార్టక్ చేస్తూ కొన్ని రోజులుగా వీరంగం చేస్తూ గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో డీసీపీ వాహనానికి ఉన్న కవర్ని తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాళ్లతో తన్నడం చేస్తున్నారు.
ఇదే క్రమంలో హీరోయిన్ డింపుల్ హయాతి మే 14న తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పార్కింగ్‌లో ఉన్న డీసీపీ కారు ముందు భాగం దెబ్బతింది. ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడమే కాకుండా కారుని కాలితో తన్ని నానా హంగామా సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ గొడవకు దిగింది. ఈ విషయంపై డింపుల్ హయాతి, విక్టర్ డేవిడ్‌లపై ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపై 353, 341, 279 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
డింపుల్ హయాతిపై ప్రభుత్వం ఆస్తుల ధ్వంసం కేసు కూడా నమోదైంది. పలు మార్లు ఐసీఎస్ అధికారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తీరు మార్చుకోని డింపుల్. ఆగడాలు రోజు రోజుకీ శృతిమించడంతో ఫైనల్‌గా కేసు నమోదు చేశారు. పోలీస్ ఆఫీసర్ పార్కింగ్ నే వాడుకుంటూ అతనిపై వీరంగం సృష్టించడం ఏంటని, డింపుల్ మరీ ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించిందని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన బుద్ధి చెప్పాలని నెటిజన్లు డింపుల్‌పై కామెంట్లు చేస్తున్నారు.
డింపుల్ హయాతి ఇటీవలే గోపీచంద్‌తో కలిసి `రామబాణం` మూవీతో నటించింది. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనిపించుకుంది. ఖిలాడీ, రామబాణం సినిమాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడమే కాకుండా హీరోయిన్గా మంచి ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్న డింపుల్ కెరీర్‌పై తాజా సంఘటన ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.