Cannes Film Festival:కాన్స్ చిత్రోత్సవం మొదలైందంటే తారలకు పండగే. సరికొత్త కాస్ట్యూమ్స్‌తో రెడ్ కార్పెట్‌పై హొయలు పోతూ ఫిల్మ్ ఫెస్టివెల్‌కు సరికొత్త మెరుపులు అద్దుతుంటారు.
Cannes Film Festival : కేన్స్ చిత్రోత్సవం మొదలైందంటే తారలకు పండగే. సరికొత్త కాస్ట్యూమ్స్‌తో రెడ్ కార్పెట్‌పై హొయలు పోతూ ఫిల్మ్ ఫెస్టివెల్‌కు సరికొత్త మెరుపులు అద్దుతుంటారు. ఈ చిత్రోత్సవంలో ప్రత్యేకంగా పాల్గొనాలని చాలామంది డ్రీమ్. ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్లతో కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకుని రెడ్ కార్పెట్‌పై హీరోయిన్లు గ్లామర్ తళుకులతో పట్టపగలే మెరుపులు మెరిపిస్తూ మురిసిపోతుంటారు. క్రేజీతారలు ఎంతగానో ఎదురు చూస్తున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ రానే వచ్చింది. 76 వ కేన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుండి ఫ్రాన్స్‌లో స్టార్ట్ అయిన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగనున్నాయి.
ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్ కు చెందిన రూబెన్ ఓస్ట్ లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్.మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్‌పై మెరవనున్నారు. తొలి రోజు వేడుకల్లో విశేషాలు చాలానే ఉన్నాయి.
జాన్ డ్యె బెర్రీకి స్టాండింగ్ ఒవేషన్…
మొదటి రోజు బయోగ్రఫికల్ డ్రామా `జాన్ డ్యు బెర్రీ` ప్రదర్శనతో ప్రారంభమై చివరి రోజు ఉత్సవాలు `ఎలిమెంటల్` సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. `జాన్ డ్యు బెర్రీ` సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జాని డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్ర ప్రదర్శన ముగిసిన తరువాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి అద్భుత స్పందన లభించడంతో జాన్ డెప్ కళ్ళు చెమర్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఇండియన్ తారలు…
ప్రతి ఏడాది కేన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు రెడ్ కార్పెట్‌పై మెరుస్తుంటారు. ఈ సారి తొలి రోజు బాలీవుడ్ స్టార్స్ సారా అలీఖాన్, ఈషాగుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్ పై హొయలొలికించి మెరిసారు. సారా, ఈషా, మానుషీలు తొలిసారి కాన్స్ చిత్రోత్సావాలలో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. దేశీ లుక్ లో కనిపించిన సారాకి మంచి ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా అనుష్క శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్ ,నాగాలాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలి సారిగా కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీ రావ్ హైదరీ, నటుడు విజయవర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొన్నారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన కెన్నెడీ, దర్శకుడు కను బెహ్లీ తీసిన ఆగ్రా, మణిపూర్, దర్శకుడు అరిభామ్ శ్యామ్ తెరకెక్కించిన ఇషానౌ, యధాజిత్ బసు, నెహెమిచ్ వంటి భారతీయ చిత్రాలు,కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కానున్నాయి. కెన్నెడీ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరయ్యారు.
రెడ్ కార్పెట్‌పై ఆరాధ్యతో కలిసి..
కేన్స్ చిత్రోత్సావాలు అంటే చాలా మంది ఐశ్వర్య రాయ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే రెండు దశాబ్ధాలుగా కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యరాయ్ తళుక్కుమంటూ మెరుస్తుంది. షారూక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన దేవదాస్ (2002) వ చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ఈ ఏడాది కూడా ఐష్ తన కూతురు ఆరాధ్యతో కలిసి సందడి చేయనుంది. ఇండియన్ సినిమాకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 2022 సంవత్సరంలో అరుదైన గౌరవం దక్కింది.