Camedian Sudhakar:కమెడియన్ సుధాకర్ చనిపోయాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సుధాకర్ స్పందించారు. ఓ వీడియోని విడుదల చేశారు.
Camedian Sudhakar:కమెడియన్ సుధాకర్ చనిపోయాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సుధాకర్ స్పందించారు. ఓ వీడియోని విడుదల చేశారు. తన గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంత కాలంగా సుధాకర్ ఆరోగ్యం బాగాలేదని, ఆయన ఐసీయూలో ఉన్నారంటూ వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై స్టార్ కమెడియన్ సుధాకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. తప్పుడు వార్తలని నమ్మవద్దని, ఇలాంటి రూమర్స్‌ని సృష్టించవద్దని కోరారు. `నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. అవన్నీ అవాస్తవాలు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి రూమర్స్ ని ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను` అని తెలిపారు.
సుధాకర్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లక్షణంగా ఉన్న సుధాకర్‌పై తప్పుడు వార్తలని ఎందుకు సృష్టిస్తున్నారని, ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిపై ఇలాంటి తప్పుడు వార్తలని ప్రచారం చేయొద్దంటూ ఫైర్ అవుతున్నారు. గతంలోనూ సుధాకర్ మృతి చెందాడంటూ కథనాలు వినిపించాయి. చాలా వరకు ప్రసార సాధనాలు భారీ స్థాయిలో వార్తలని ప్రచారం చేశాయి.
తాజాగా అదే స్థాయిలో మరోసారి కమెడియన్ సుధాకర్‌పై ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుండటంతో ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించిన సుధాకర్ 1978లో భారతీరాజా రూపొందించిన `కిలక్కె పోగుమ్ రైల్` తమిళ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రంలో సుధాకర్‌కు జోడీగా రాధిక నటించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగులో `తూర్పువెళ్లే రైలు` పేరుతో భారతీరాజా రీమేక్ చేశారు. ఇందులో మోహన్,జ్యోతి జంటగా నటించారు.
ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోగా నటించిన సుధాకర్ సహయ నటుడిగా, విలన్‌గా.. తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని తనదైన మార్కు డైలాగ్ డెలివరీతో విశేషంగా ఆకట్టుకున్నారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఆయన చనిపోయారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా సుధాకర్ స్పందించారు.