Pooja Hegde: బుట్టబొమ్మ చివరికి నాగ్ ను కూడా వదలలేదా..?
Butta Bomm Romance With Akkineni Nagarjuna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒక ప్రత్యేకమైన రికార్డును అందుకోబోతోంది. ఇద్దరు కొడుకులతోనే కాకుండా తండ్రితో కూడా రొమాన్స్ చేసిన హీరోయిన్ గా పూజా రికార్డు సృష్టించబోతోంది. ఆ హీరోలు ఎవరో కాదు అక్కినేని వారసులు. ఒక లైలా కోసం సినిమాలో నాగ చైతన్య సరసన నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది బుట్ట బొమ్మ. ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం వరుస అవకాశాలను అందించింది. అందంతోనో తెలివితోనో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ నంబర్ 1 పొజిషన్ కు వచ్చింది.
ఇక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసి తన లక్ ను అఖిల్ కు ఇచ్చేసింది. ఇప్పటివరకు హిట్ అందుకొని అఖిల్ ఈ సినిమాతో ఒక్కరిగా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇద్దరు కొడుకులతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తండ్రి నాగ్ తో జత కట్టింది. ఓ కమర్శియల్ యాడ్ కోసం నాగ్ తో పూజా రొమాన్స్ చేస్తుందట. గత కొంత కాలంగా ఆయన సినిమాల కన్నా ఎక్కువగా యాడ్స్ చేస్తున్నారు. వాటి ద్వారానే కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇక దీనికోసమే వీరు ఫోటోషూట్ కూడా చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఒకే కుటుంబంలోని హీరోలందరితో కలిసి రొమాన్స్ చేసిన ఘనత మాత్రం పూజాకే దక్కిందని అంటున్నారు అభిమానులు.