పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో బ్రో ది అవతార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో బ్రో ది అవతార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రంలో పవన్ దేవుడు గా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి తేజ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైట్ అండ్ వైట్ సూట్ లో తేజ్ చాలా అందంగా, స్టైలిష్ గా కనిపించాడు. వెనుక టైమ్ బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తుంది.
తేజ్ ఈ సినిమాలో మార్కండేయులు ఆకా మార్క్ అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా మార్క్.. బ్రోది అవతార్ కు ఫ్రెండ్ అని.. ఆయనను బ్రో అని పిలిచే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు, ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. పవన్ లుక్.. ఇప్పుడు తేజ్ లుక్.. త్రివిక్రమ్ డైలాగ్స్, సముతిరఖని ఎలివేషన్స్.. థమన్ మాస్ మ్యూజిక్.. ఇవన్నీ సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెంచేసాయి. మరి ఈ మామ అల్లుళ్ళు హిట్ ఇస్తారో లేదో చూడాలి.