Boyapati Rapo First Thunder:యాక్షన్ ఎంటర్టైనర్లకు తనదైన మార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని జోడించి తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu).
Boyapati Rapo First Thunder:యాక్షన్ ఎంటర్టైనర్లకు తనదైన మార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని జోడించి తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu). `అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను అదే జోష్‌తో ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్‌తో ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సోమవారం హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా `ఫస్ట్ థండర్` పేరుతో ఓ వీడియోని విడుదల చేశారు.
పేరుకు తగ్గట్టే బ్లాస్టింగ్ విజువల్స్‌తో వీడియో మొదలైంది. హీరో రామ్ రగ్గ్డ్ లుక్‌లో కనిపిస్తూ దున్నపోతుని పట్టుకుని విలన్ ఏరియాలోకి ఎంట్రీ ఇస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. `నీ స్టేట్ దాటలేనన్నావ్..దాటా..నీ గేట్ దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా..ఇంకేంటి దాటేది నా బొ.. లిమిట్స్.. ` అంటూ రామ్ చెబుతున్న హైవోల్టేజ్ డైలాగ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. సదర్ పండగ నేపథ్యంలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ని దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించినట్టుగా తెలుస్తోంది.
59 సెకండ్ల నిడివితో సాగిన వీడియో ఆద్యంతం ఓ హైవోల్టేజ్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా స్పష్టం చేస్తోంది. ఈ వీడియోలో హీరోయిన్ శ్రీలీలని ఓ కాలేజీ స్టూడెంట్‌గా చూపించారు. సంతోష్ ఛాయాగ్రహణం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ థండర్ కు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.
ఇటీవలే ఈ మూవీ చరిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ థండర్‌తో బోయపాటి మార్కు యాక్షన్‌ని చూపించి సినిమా ఏ స్థాయిలో ఉండనుందన్నది క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. దీంతో రామ్ అభిమానులు ఫస్ట్ థండర్ తో హ్యాపీ ఫీలవుతున్నారట.
ఎనర్జిటిక్ హీరో రామ్, అంతే ఎనర్జీతో యాక్షన్ ఎంటర్టైనరన్లని అందించే బోయపాటి శ్రీనుల కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రకాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ ఫైనల్ కానీ ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా రామ్, బోయపాటి శ్రీను ఏ స్థాయి రికార్డుల్ని తిరగరాస్తారో తెలియాలంటే అక్టోబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.