Ranbir Kapoor: పుష్ప రాజ్ పాత్ర కావాలంటున్న స్టార్ హీరో
Bollywood Star Ranbir Kapoor Interested In Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో రికార్డులను బద్దలుకొట్టి తెలుగు సినిమా అంటే ఇది అని నిరూపించింది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా అక్కడి సెలబ్రెటీలు ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ కూడా మన సినిమాలను ఆధరిస్తూ చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా తనకు పుష్ప లాంటి పాత్ర చేయాలనీ ఉందని బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
రణబీర్ కపూర్ తన సినిమా షంషేరా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పుష్ప రాజ్ పాత్రకు బాగా న్యాయం చేశాడని.. అద్భుతమైన మానరిజంతో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు పుష్ప రాజ్ పాత్ర చేయాలని ఉందని, అలాంటి పాత్ర వస్తే తప్పక చేస్తానని తెలిపాడు. పుష్ప సీక్వెల్ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పుష్ప సిగ్నేచర్ డైలాగ్ తగ్గేదే లే చెప్పడంతో పాటు యాక్ట్ చేసి చూపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా బాలీవుడ్ లో తెలుగు హీరోల హవా అస్సలు తగ్గేదేలే అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.