Pushpa 2:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన `పుష్ప` (Pushapa) ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Pushpa 2:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన `పుష్ప` (Pushapa) ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. `పుష్ప` పాపులర్ డైలాగ్, హుక్ స్టేప్ని ఫేమస్ క్రికెటర్లు సైతం రీల్స్ చేశారంటే సినిమా ఏ రేంజ్ క్రేజ్‌ని దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో సినిమాని తెరకెక్కించడమే కాకుండా అల్లు అర్జున్ క్యారెక్టర్ ని మలిచిన తీరు కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది మార్కెట్లో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే కేవలం మౌత్ టాక్‌తో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. దీంతో సీక్వెల్‌ని మరింత స్పెషల్‌గా భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. బడ్జెట్ తో పాటు క్రేజీ ఆర్టిస్ట్‌లని కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తూ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరపైకి తీసుకొస్తున్నారు.
Pushapa 2
అంతే కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలోనే మోస్ట్ వాటెండ్ సినిమాగా `పుష్ప 2`ని తీర్చి దిద్దుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. `పుష్ప` ఎండింగ్లో ఫహద్‌ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. అయితే పార్ట్ 2లోనూ ఆయన పాత్ర కొనసాగుతుండగా మరో క్రేజీ హీరో కూడా ఇందులో గెస్ట్ రోల్లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందు కోసం బాలీవుడ్ హైపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ ని లైన్లోకరి తీసుకొచ్చారట.
ఆయనతో ఓ పవర్ ఫుల్ గెస్ట్ రోల్ ని చేయించాలనే ఆలోచనతో సుకుమార్ రణ్ వీర్ సింగ్‌ని తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఇందులో రణ్ వీర్ సింగ్ కనిపిస్తారని, అతని క్యారెక్టర్‌తో నార్త్ ఇండియా మార్కెట్ ని ఈ సారి భారీ స్థాయిలో కొల్లగొట్టాలనే ఆలోచనలో సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక అప్ డేట్ త్వరలోనే రానుందట.
పాన్ ఇండియా స్థాయికి మించి ఈ సినిమయాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్, బన్నీ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బడ్జెట్, ఆర్టిస్ట్‌లు,లొకేషన్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ పుట్టిన రోజున విడుదల చేసిన స్పెషల్ వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాబిన్ హుడ్ తరహాలో బన్నీ క్యారెక్టర్ని మలిచిన తీరు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసిన మేకర్స్ క్రేజీ స్టార్లని గెస్ట్ క్యారెక్టర్స్ చేయిస్తూ మరింతగా సినిమాపై క్రేజ్‌ని పెంచాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక ఘట్టాలని షూట్ చేస్తున్న టీమ్ త్వరలో బన్నీకి సంబంధించిన సీన్స్ కోసం మారేడుమిల్లి అడవులకు వెళ్లనుందని తెలిసింది.