Bipasha Basu: తల్లి కాబోతున్న మరో బాలీవుడ్ హీరోయిన్..?
Bipasha Basu and Karan Singh Grover expecting first child: ఇటీవల కాలంలో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం, తల్లులుగా మారడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఇప్పటికే పెళ్లైన రెండు నెలలకే అలియా భట్ తాను గర్భవతిని అని ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే పెళ్లి అయినా ఆరేళ్ళ తరువాత బాలీవుడ్ నటి బిపాసా బసు తల్లి కాబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కెరీర్ పీక్ దశలో ఉండగా మూవీస్‌కు బైబై చెప్పి నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహమాడిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తల్లి అయ్యినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మినివ్వబోతున్నట్టు బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
భూషణ్ పటేల్ తెరకెక్కించిన ‘ఎలోన్’ లో బిపాసా, కరణ్ సింగ్ గ్రోవర్ జంటగా నటించారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే మొదట్లో ఆమె ప్రెగ్నెంట్ అంటూ చాలా వార్తలు షికారు చేశాయి. కాగా, అందులో నిజం లేదని తేలిపోయింది. ఈసారి మాత్రం బిపాసా తన ప్రెగ్నెన్సీ గురించి అభిమానులకు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్నిరోజులో ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు బాలీవుడ్ వర్గాలు.