Allu Arjun: వరుడు భామ కు అసలు ఏమైంది.. ఏంటీ ట్వీట్స్ గోల..?
Bhanushree Mehra Comments About Allu Arjun: అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు సినిమా గుర్తుందా.. అందులో హీరోయిన్ గా నటించిన భాను ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సినిమా సమయంలో అమ్మడి ముఖాన్ని చూపించకుండా ఎంత హడావుడి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత చెప్పుకోదగ్గ సినిమాల్లో ఏమి అమ్మడు కనిపించింది లేదు. ఇక సడెన్ గా ఒకే ఒక్క ట్వీట్ తో ముద్దుగుమ్మ మరోసారి వార్తలో నిలిచింది. అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేసారు అంటూ ఒక్క ట్వీట్ చేసిందో లేదో అందరూ ఏమైంది ఏమైంది అంటూ అడగడం మొదలుపట్టేశారు. తానేం తప్పుచేయకపోయినా బన్నీ తనను బ్లాక్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ వైరల్ అయిన కొద్దిసేపటికే బన్నీ తనను అన్ బ్లాక్ చేసినట్లు చెప్పి మరో షాక్ ఇచ్చింది. అదే సమయంలో తన కారణంగా హర్ట్ అయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సర్ది చెప్పింది. బన్నీ అభిమానులని హర్ట్ చేసే ఉద్దేశ్యం తనకి లేదని చెప్పుకొచ్చింది.
” బన్నీ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టాలని నేను ఆ ట్వీట్ చేయలేదు. నేను కూడా అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ ని. నా కెరియర్ చూసి నేను నవ్వుకుంటాను. నా బాధలు చూసి నేను నవ్వుకుంటా. అంతకు మించి నాకు ఎలాంటి ఉద్దేశ్యం లేదు. ప్రేమని పంచుదాం. ద్వేషాన్ని వదిలేద్దాం” అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఈ ట్వీట్ల గోల ఏంటి పాప.. బన్నీతో నీకు ప్రాబ్లమ్ ఏంటి అంటూ అభిమానులు గోల చేసస్తున్నారు. మరి ఈ విషయమై బన్నీ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.