Bellamkonda Srinivas:అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్నీ..అన్నాడో సినీ కవి.. ఈ మాటలు అక్షరాలా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ విషయంలో నిజమయ్యాయి.
Bellamkonda Srinivas:అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్నీ..అన్నాడో సినీ కవి.. ఈ మాటలు అక్షరాలా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ విషయంలో నిజమయ్యాయి. `అల్లుడు శీను`(Alludu Seenu) సినిమాతో బెల్లంకొండ వారసుడిగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. జయ జానకి నాయక, రాక్షసుడు వంటి సినిమాలతో విజయాల్ని దక్కించుకుని పవర్ ఫుల్ మాస్ హీరో అనిపించుకున్నారు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ `ఛత్రపతి` రీమేక్‌తో బాలీవుడ్‌లోనూ పాగా వేయాలని ప్రయత్నించి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడ్డారు.
రాజమౌళి క్లాప్‌తో వి.వి.వినాయక్ దర్శకత్వంలో అట్టహాసంగా `ఛత్రపతి` రీమేక్‌ని ప్రారంభించి భారీ స్థాయిలో మే 12న విడుదల చేశారు. జయ జానకి నాయక, రాక్షసుడు వంటి సినిమాల హిందీ వెర్షన్లకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి రికార్డు స్థాయి ఆదరణ లభించడంతో `ఛత్రపతి` రీమేక్‌కు కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందని భావించారు. కానీ ఫలితం తారుమారైంది.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది.
ఈ నేపథ్యంలో `ఛత్రపతి` ఫ్లాప్‌పై హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు. `ఆశల నుంచే స్ఫూర్తి లభిస్తుంది. జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకోవడంతో నేను ఇక్కడి వరకు చేరుకోగలిగాను. నా ప్రయాణంలో ఎదురు దెబ్బలు తగలవచ్చు. అయినప్పటికీ నా మనసు కోరుకునే ఆనందాన్ని అందించడం కోసం కష్టపడి పని చేయాలనేదే నా అజెండా` అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
హిందీలో `ఛత్రపతి` మూవీని పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై డా. జయంతిలాల్ గడ నిర్మించారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నుష్రత్ బారూచా హీరోయిన్గా నటించగా, తల్లి పాత్రలో భాగ్యశ్రీ కనిపించారు. ఇతర కీలక పాత్రల్లో కరణ్ సింగ్ తదితరులు నటించారు. నిర్మాణం నుంచే ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వచ్చిన `ఛత్రపతి` రీమేక్ ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ ఇచ్చింది.