Pooja Hegde: పూజాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నిర్మాతలు..?
‘Beast’ producers Shock to Pooja Hegde: బుట్ట బొమ్మ చిక్కుల్లో పడిందా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఆమె చేసిన అతి వలనే ఆమె చిక్కులో పడిందని తెలుసస్తోంది. అసలు విషయం ఏంటంటే.. గత కొన్ని రోజుల నుంచి పూజాపై ఒక రూమర్ వినిపిస్తోంది. మొదటి లో సెట్ కు ఇద్దరు ముగ్గురు స్టాఫ్ ను తీసుకొచ్చే ఆమె.. ఒక స్టార్ డమ్ వచ్చాక ఏకంగా డజన్ మందిని వెంటబెట్టుకొని వస్తుందంట. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా డిజైనర్, హెయిర్ స్టైలిస్ట్ తప్పకుండా పక్కన తీసుకెళ్తారు.. అది అందరికి తెలిసిందే.
అయితే బుట్ట బొమ్మ మాత్రం 12 మంది స్టాఫ్ ను మెయింటైన్ చేస్తుందట.. వారి జీతాలు, ఫుడ్, ట్రావెలింగ్ ఖర్చులన్ని నిర్మాత మీదకు తోసేస్తున్నని సమాచారం. పైగా రెమ్యూనరేషన్ కాకుండా తనతో పాటు తన స్టాఫ్ కి అయ్యే ఖర్చులను కూడా నిర్మాణ సంస్థ భరించాలని ముందుగానే అగ్రిమెంట్ కుదుర్చుకుంటుందట. దీంతో నిర్మాతపై అదనపు ఖర్చు పడుతున్నదని సమాచారం. అయితే స్టార్ హీరోయిన్ కాబట్టి, వరుస హిట్లు అందుకోవడంతో నిర్మాతలు కూడా చేసేదేం లేక ఆ ఖర్చు కూడా భరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఒక చిత్ర నిర్మాతలు మాత్రం పూజాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్, పూజా జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అభిమానులను నిరాశపర్చింది. ఇక దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. అయితే నష్టపోయిన సదురు నిర్మాతలు పూజాకు ఝలక్ ఇచ్చారట. పూజా హెగ్డే మరియు ఆమె స్టాఫ్ ఖర్చులు మరింత భారంగా ఉండడంతో నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చును తానే కట్టుకోవాలంటూ బిల్లు పేపర్లను ఆమెకు పంపడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ వార్తపై పూజాను నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. అతి చేస్తే ఇలాగే ఉంటుంది మరి.. స్టార్ హీరోయిన్ అయితే మాత్రం ఇంత ఓవర్ చేయాలా..? అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయమై పూజా హెగ్డే ఎలా స్పందిస్తుందో చూడాలి.