Bandla Ganesh: పూరి కొడుకు ఈవెంట్ లో పూరి గుట్టురట్టు చేసిన బండ్ల గణేష్
Bandla Ganesh Speech At Chor Bazar Pre Release Event: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. . లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తున్నది. ఈనెల 24న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అవాసా హోటల్ లో గగ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు నిర్మాత, నటుడు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఈవెంట్ కు 20 నిమిషాలకు మును పూరి అన్న భార్య, మా వదిన లావణ్య నువ్వు రావాలి అని చెప్పింది.. ఆమె నాకు తల్లితో సమానం.. సీతాదేవి ఎలా ఉంటుందో నాకు తెలియదు.. కానీ సీత దీవిలో ఉన్న గొప్ప లక్షణాలు మా వదినలో ఉన్నాయి. ఆమె అంటే నాకు చాలా ఇష్టం.. ఎన్నో కష్టాలు పడింది.
పూరి జీవితంలో ర్యాంపులు, వ్యాంపులు ఎంతోమంది ఉన్నా మొదటి నుంచి ఉన్నది ఈ మహాతల్లే.. పూరి అన్న పెద్ద డైరెక్టర్ అవుతాడు.. భూమి బద్దలు కొట్టేస్తాడు, ఇండస్ట్రీని దొబ్బేస్తాడని ఆయనను పెళ్లి చేసుకోలేదు.. జేబులో రెండు వందలు ఉన్న పూరిని చూసి .. వీడు బావున్నాడు.. నాకు కన్ను కొట్టాడు అంటూ లవ్ చేసి వచ్చేసి సనత్ నగర్ లో మూడు ముళ్లు వేస్తే స్కూటర్ ఎక్కి వచ్చేసింది.. ఇక పూరి ఎంతోమందిని స్టార్లను చేశాడు కానీ కొడుకును స్టార్ ను చేయలేకపోయాడు. కొడుకు ఫంక్షన్ కు నువ్వు రాకుండా ముంబై లో ఉండడం బాగోలేదు అన్నా.. మన జీవితం ఉన్నదే వారి కోసం.. నా కొడుకు కోసం అయితే లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చేవాడిని.
పూరి ఎంతోమందిని స్టార్లను, సూపర్ స్టార్లను, మెగా స్టార్లను చేశాడు. వారందరూ వచ్చి పూరి కొడుకు సినిమా.. సపోర్ట్ చేయండి అని అంటారనుకున్నా..కానీ వారు రారు.. సినిమా కదా. వాళ్ల బిజీ వాళ్లకు ఉంటుంది ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆకాష్ బంగారం.. మంచి టాలెంట్ ఉంది .. నేను సపోర్ట్ చేస్తాను.. సినిమా బావుంది.. అందరు చూడండి.. ఎందుకంటే ఇది మా వదిన కల.. ఆమె కొడుకు విజయాన్ని చూడడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. డైరెక్టర్ క్ను రెండు మూడు సార్లు కలిసాను. కథ బాగా రాసాడు. సిసినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా..” అని తెలిపాడు.