Bandla Ganesh:టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నెట్టింట చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారాయన.
Bandla Ganesh:టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నెట్టింట చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారాయన. కాంగ్రెస్ పార్టీలో చేరి తనదైన స్టేట్మెంట్లతో నానా హంగామా చేసిన ఆయన గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో నెటిజన్లు బ్లేడ్ కావాలా బండ్లన్నా అంటూ ఓ ఆట ఆడుకున్నారు.
ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల తరువాత బండ్ల గణేష్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇక నుంచి సినిమాపై మాత్రమే దృష్టిపెడతానని ప్రకటించారు. ఆనాటి నుంచి రాజకీయ ట్వీట్లకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కర్ణాటకలో బిజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా విక్టరీని సాధించడం..త్వరలో అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న నేపథ్యంలో బంగ్ల గణేష్ చేసిన ట్వీట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
`రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా!..` అంటూ ట్వీట్ చేసి మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇంత కాలంగా తాను రాజకీయాలకు దూరం అని చెప్పుకుంటూ వచ్చిన బండ్ల గణేష్ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధంచడంతో ఒక్కసారిగా తన ఒపీనియన్‌ని మార్చుకోవడం, నెట్టింట మళ్లీ రాజకీయ ట్వీట్లతో యాక్టీవ్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే సోమవారం బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. `మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే…కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు.!!` అంటూ బీజేపీని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బంగ్లాని ఖాలీ చేసిన విషయం తెలిసిందే. అధికార బీజేపీ వర్గాలు రాహుల్ ఆ నివాసాన్ని ఖాలీ చేయాల్సిందేనని పట్టుబట్టడంతో రాహుల్ ఆ బంగ్లాని ఖాలీ చేశారు. అంతే కాకుండా ఆ బంగ్లాలో ఉన్న తన సామాన్లను ట్రక్కులో మరో నివాసానికి తరలించారు రాహుల్ గాంధీ.
ఈ సంఘటన జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మా నేతను బలవంతంగా బంగ్లా నుంచి ఖాలీ చేయిస్తే.. కర్ణాటక ప్రజలు మీమ్మల్ని అధికార పీఠం నుంచి ఖాలీ చేయించారని వ్యగ్యంగా చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. బీజేపీ ప్రభుత్వంపై బండ్ల గణేష్ వ్యంగ్యంగా స్పందించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌పై నెటిజన్ లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది మాత్రం `అన్నా సెవెనో క్లాక్ బ్లేడ్ ఇంటికి పంపించమంటావా? ..అడ్రస్ పెట్టు` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే…
కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు.!! @INCIndia @INCTelangana @RahulGandhi @revanth_anumula— BANDLA GANESH. (@ganeshbandla) May 15, 2023