Nandamuri Balakrishna: వారికి బాలయ్య క్షమాపణలు… ఎందుకంటే?
Balakrishna Released Press Note On Latest Controversy: నందమూరి బాలకృష్ణ పండుగపూట దేవ బ్రాహ్మణులను క్షమించమని అడిగారు. తాను చేసింది తప్పని, దయవుంచి మన్నించమని కోరారు. వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని బాలయ్య తప్పుగా చెప్పడంతో దేవ బ్రాహ్మణుల సంఘం మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో దేవ బ్రాహ్మణ సంఘాలు చరిత్ర గురించి తెలుసుకోవాలని, ఆ తరువాత బాలకృష్ణ దీనిపై వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం విన్న బాలకృష్ణ తన తప్పును మన్నించండి అంటూ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.
“దేవ బ్రాహ్మ్ణణ నాయకుడు రావణ బ్రహ్మ అని తనకు అందిన సమాచారం తప్పని తెలియచేసిన దేవ బ్రాహ్మణ పెద్దలందరికి కృతజ్ఞతలు. తను అన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. తనకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు.. ఉండదని కూడా తెలుగు ప్రజలందరికి తెలుసు. ఆ సందర్భంతో దురదృష్టవశాత్తూ అలవోకగా వచ్చిన మాట మాత్రమే అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది. దేవాంగుల లో తన అభిమానులు చాలామంది ఉన్నారు. తన వాళ్లని తాను బాధ పెట్టగలనా.. అర్థం చేసుకుంటారని భావిస్తున్నా పొరపాటుని మన్నిస్తారని ఆశిస్తున్నా అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ గా మారింది.