Balakrishna:నందమూరి బాలకృష్ణ `అఖండ` (Akhanda) సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. ఈ సక్సెస్ జోష్‌తో ఈ ఏడాది ప్రారంభంలో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన `వీర సింహారెడ్డి`(Veera simhareddy) ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసిందే.
Balakrishna:నందమూరి బాలకృష్ణ `అఖండ` (Akhanda) సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. ఈ సక్సెస్ జోష్‌తో ఈ ఏడాది ప్రారంభంలో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన `వీర సింహారెడ్డి`(Veera simhareddy) ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ మూవీ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
బాలయ్య 108వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించనుంది. బాలకృష్ణ మాసీవ్ క్యారెక్టర్లో డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించనున్నారు. అంతే కాకుండా ఆయన ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత నందమూరి బాలకృష్ణ తన 109వ ప్రాజెక్ట్‌ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్న విషయం తెలిసిందే. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమాని బాలకృష్ణ – బోయపాటి చేయబోతున్నారు. 2024 ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు.
తాజాగా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ని బ్లాక్ బస్టర్ ఫిల్మ్ `లెజెండ్`కు సీక్వెల్‌గా ప్లాన్ చేస్తున్నారట. `లెజెండ్ 2` అనే టైటిల్‌తో ఈ సినిమాని చేయబోతున్నారట. ఇప్పటికే బోయపాటి శ్రీను స్క్రిప్ట్ వర్క్‌ని స్టార్ట్ చేశారని, బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10న అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో ప్రకటించనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ వంటి హిట్ సినిమాలొచ్చాయి. ఇది వీరిద్దరి కలయికలో రానున్న 4వ ప్రాజెక్ట్. అందుకే దీన్ని BB4 అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని ఎవరు నిర్మిస్తారు. ఆ వివరాలేంటీ అన్నది తెలియాలంటే జూన్ 10 వరకు వేచి చూడాల్సిందే.