Balagam: చిన్న సినిమా.. పెద్ద విజయం.. బలగం కలెక్షన్స్
Balagam 9 Days Collections: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమైన చిత్రం బలగం. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం కూడా తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం పెద్ద విజయాన్ని అందుకుంది. మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి 3 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్ లో విజయవంతంగా రన్ అవుతోంది. ఇక ఇప్పటివరకు బలగం ఎంత కలెక్షన్స్ రాబట్టింది అంటే.. ఏకంగా 10 కోట్ల దగ్గర గ్రాస్ ని చేరుకుంది.
మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు ఏకధాటిగా మంచి కలెక్షన్స్ రాబట్టి ఔరా అనిపిస్తుంది. చక్కటి పల్లెటూరి కథగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మన ఊరి కథ.. మన తెలంగాణ కథ అంటూ జైజేలు కొడుతున్నారు. ఈ మధ్యనే బలగం చిత్రబృందం ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించిన విషయం తెల్సిందే. కొత్త దర్శకుడుగా వేణు మంచి పేరునే అందుకున్నాడు. మరి ఈ సినిమా విజయంతో టాలీవుడ్ లో అతడికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.