నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) - అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి(bagavanth Kesari).
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) – అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి(bagavanth Kesari). షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీ లీల ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను విలన్ గా దింపారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేడు బాలయ్య బర్త్ డే(Happy Birthday NBK) సందర్భంగా అభిమానులకు మరో పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. భగవంత్ కేసరి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి బాలయ్య కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో బాలయ్య అభిమానులు సందడి చేశారు. హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ లాంచ్ ని చిత్రయూనిట్ లాంచ్ చేశారు.
ఇక ఫస్ట్ గ్లింప్స్ లో బాలయ్య ఊచకోత కనిపిస్తుంది. తెలంగాణ యాసతో పాటు బాలయ్య హిందీ డైలాగ్స్ కు థియేటర్ లో మారుమ్రోగిపోతాయి అని చెప్పడం లో ఏటువంటి అతిశయోక్తి లేదు. ” రాజు .. వాని యేనక ఉన్న మందిని చూయిస్తాడు.. మొండోడు.. వానికి ఉన్న ఒకే ఒక గుండెను చూయిస్తాడు” అని బాలయ్య గుండె చూపించి విలన్స్ కు వార్నింగ్ ఇవ్వడం అదిరిపోయింది. ఇక హిందీ డైలాగ్స్.. నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా యేండ్లు యాద్ ఉంటది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ వీడియో మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇక బాలయ్య సినిమాకు థమన్ ఇచ్చే మ్యూజిక్ వీర లెవెల్ అంతే. మొత్తానికి బర్త్ డే వీడియోతో నే అనిల్.. తన విశ్వరూపం చూపించేశాడు. విజయ దశమి కానుకగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.