ఓటీటీలోకి వచ్చిన బేబీ(Baby).. అక్కడ కూడా రికార్డుల (records)మోత మోగించడం ప్రారంభించింది. ఓటీటీలోకి బేబీ ఎంటర్ అయిన 32 గంటల్లోనే అత్యంత వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందిన చిత్రంగా రికార్డులు సృష్టించేసింది.
Baby : చిన్న సినిమాగా.. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ ‘బేబీ’(Baby). ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్(Viraj Ashwin) ప్రధాన పాత్రలో నటించిన బేబీ మూవీకి సాయి రాజేష్ డైరక్షన్ చేశాడు. జులై 14న విడుదలైన Baby (released on 14th July) బేబీ (Baby) సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 70 కోట్లు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినీ విశ్లేషకులు కూడా షాక్‌కు గురయ్యారు.
థియేటర్‌లో పెద్ద సినిమాల కలెక్షన్స్‌తో పోటీపడి సత్తా చాటిన ‘బేబీ’(Baby)..ఆహా ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 25న వచ్చేసింది. అయితే ఓటీటీలోకి వచ్చిన బేబీ(Baby).. అక్కడ కూడా రికార్డుల (records)మోత మోగించడం ప్రారంభించింది. ఓటీటీలోకి బేబీ ఎంటర్ అయిన 32 గంటల్లోనే అత్యంత వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందిన చిత్రంగా రికార్డులు సృష్టించేసింది. ఈ విషయాన్ని ఆహా సంస్థ ‘తీన్మార్ మోగింది.. ‘బేబీ’(Baby) సినిమా కేవలం 32 గంటల్లో అత్యంత వేగవంతమైన 100 మిలియన్ నిమిషాల ఆనందాన్ని ప్రసారం చేసింది’ అంటూ ప్రకటించింది.
ముఖ్యంగా మాస్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ‘బేబీ’ (Baby) యూత్‌ని ఉర్రూతలూగించింది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డుల్ని సృష్టిస్తూ క్రేజీ బ్లాక్ బస్టర్లనే వెనక్కి నెట్టేస్తూ ట్రేడ్ పండితుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలు, సెలబ్రిటీలు, స్టార్ హీరోలు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఓటీటీలోనూ అదే జోరు కంటెన్యూ చేయడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.