బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు, సింగర్ ఆయుష్మాన్ ఖురానా తండ్రి, ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా అలియాస్ పి. ఖురానా శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు, సింగర్ ఆయుష్మాన్ ఖురానా తండ్రి, ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా అలియాస్ పి. ఖురానా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో బాలివుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ అస్ట్రాలజర్‌గా ఈయన ఫేమస్. ఆయన జ్యోతిష్యంపైనే ఎన్నో అద్భుత రచనలు కూడా చేసారు. అంతేకాదు ఎంతో మంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్‌తో పాటు దర్శక, నిర్మాతలకు ఈయన మాట అంటే గురి. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోర్టీస్ ఆసుపత్రిలో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఇక చికిత్స అందుకుంటూనే పి. ఖురానా చివరికి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
పి. ఖురానా మరణం పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయుష్మాన్ అభిమానులు విచారం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ప్రకటిస్తూ.. ఆయుష్మాన్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఇక ఆయుష్మాన్ ఖురానా గురించి అందరికి తెల్సిందే. ఎంటీవీ వీడియో జాకీగా పనిచేసిన ఈయన ‘విక్కీ డానర్’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంధాదున్ సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ సైతం అందుకున్నాడు. డ్రీమ్ గర్ల్, బాలా చిత్రాలతో మెప్పించాడు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి డాక్టర్ జీ మూవీ చేశాడు.