Avatar 2:ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి `అవతార్`(Avatar). 2009లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది.
Avatar 2:ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి `అవతార్`(Avatar). 2009లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా `అవతార్ : ది వే ఆఫ్ వాటర్`(Avatar: The Way of Water)ని తెరపైకి తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 6న విడుదలైన 3డీ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్లుని రాబట్టి ఔరా అనిపించింది. ఇండియా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు రూ. 475 కోట్ల మేర వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్లలో రెంట్ విధానంపై సందడి చేసింది. జూన్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుందని మంగళవారం వెల్లడించింది. అంతే కాకుండా అవతార్ అభిమానులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెంట్ చెల్లించకుండానే ఈ సినిమా అందుబాటులో ఉండనుందని స్పష్టం చేసింది. దీంతో సినీ ప్రియులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 7 వరకు వేచి చూడలేమని కొంత మంది అభిమానులు కామెంట్ లు చేస్తుంటే మరి కొంత మంది మాత్రం `వావ్ సర్ ప్రైజ్ అదిరింది` అంటూ స్పందిస్తున్నారు. అయితే అవతార్ 2(Avatar2) ఏఏ భాషల్లో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని మాత్రం డిస్నీప్లస్ హాట్ స్టార్ మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన `అవతార్ 2` ప్రపంచ వ్యాప్తంగా అవతార్ కు మించి రికార్డులు సాధించింది. ఇంత వరకు ఏ సినిమా సాధించిన సరికొత్త రికార్డులని నమోదు చేసి సినీ ప్రియులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
`అవతార్ 2`ని ఈ ఏడాది మార్చి 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలైన యూవీఎస్ ఎనీవేర్, యాపిల్ టీవి, పైమ్ వీడియో, పుడు, ఎక్స్ఫినిటీ, గూగుల్ ప్లే, ఏఎంసీ, మైక్రో సాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో వ్యూ ఫర్ రెంట్ ప్రాతిపాదికన అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో మాత్రం ఎలాంటి అద్దె చెల్లించకుండానే `అవతార్ 2`ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.