Avatar 2: అవతార్ 2 ఓటిటీలోకి వచ్చేది అప్పుడే..?
Avatar 2 OTT Release Date Fix: అవతార్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూసారో అందరికి తెల్సిందే. హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ కు సీక్వెల్ గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ క్రిస్మస్ సందర్భంగా 2022 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.ప్రపంచంలో అత్యధిక వసూళ్లు చేసిన 6వ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులకు సమాధానం లభించింది.
ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలిసిన మాటే కానీ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, తదితర ఓటీటీ వేదికల్లోల ఇది స్ట్రీమింగ్ అవుతుందని తెలుపడం విశేషం. మార్చి 28 నుంచి అవతార్2 స్ట్రీమింగ్‌కి రానుంది. అయితే ఈ చిత్రం మొదట డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో రెంటల్ బేస్‌గా ఉండనుందని తెలుస్తోంది. కొన్ని రోజులపాటు డబ్బులు చెల్లిస్తేనే ఈ సినిమా చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సబ్ స్క్రైబర్లందరికీ షో అందుబాటులోకి వస్తుంది. మరి ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి సత్తా చూపిస్తోందో చూడాలి.