సినీ సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు. ప్రేమకు వయస్సు లేదని, ప్రేమకు రంగు రూపం ఉండదని వారే నిరూపిస్తూ ఉంటారు.
సినీ సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు. ప్రేమకు వయస్సు లేదని, ప్రేమకు రంగు రూపం ఉండదని వారే నిరూపిస్తూ ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ లో నరేష్- పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఇక తాజాగా వీరికన్నా ముందే మరో నటుడు 60 ఏళ్ళ వయస్సులో రెండో పెళ్లి చేసుకొని అంతకంటే ఎక్కువ షాక్ ఇచ్చాడు. టాలీవుడ్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్ధి. ఈ మధ్యనే రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరో తండ్రిగా నటించి మెప్పించాడు. స్టార్ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న ఆశిష్ విద్యార్థి.. తాజాగా తన ప్రియురాలు అయిన రూపాలి బరోవాని వివాహం చేసుకున్నాడు. ఆమె కలకత్తాలో బిజినెస్ ఎంట్రప్యూనర్ గాపనిచేస్తుందని సమాచారం. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.
ఇకపోతే ఆశిష్ విద్యార్ధికి 20 ఏళ్ల క్రితం ఆయన బెంగాలీ నటి రాజోషీ వివాహం అయ్యింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాజోషీని ప్రేమించి పెళ్లిచేసుకున్న నటుడు.. కొన్నేళ్ల క్రితమే విబేధాల వలన ఆమెతో విడిపోయినట్లు తెలుస్తోంది. భార్యతో విడిపోయాకనే రూపాలి పరిచయం కావడం.. ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగాయట. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని కొందరు అంటుండగా.. శుభాకాంక్షలు.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.