Beast: కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అరబిక్ కుత్తు
Arabic Kuthu Song From Beast Movie Crossed 500 Million Views In Youtube: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని చవిచూసింది. అయితే ఏం.. ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా హాలమతి అబిబో.. సాంగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట మోగుతూనే ఉంటుంది. అరబిక్ కుత్తు సాంగ్ గతేడాది ట్రెండింగ్ సాంగ్స్ లో మొదటి స్థానం సంపాదించుకొంది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మాత్రమే వినిపించేది.
ఇక తాజగా ఈ సాంగ్ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇక ఈ సాంగ్ ను అనిరుద్ కంపోజ్ చేయగా స్టార్ హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించాడు. ఇక విజయ్, పూజా స్టెప్స్.. ముఖ్యంగా పూజా అందాలు సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సాంగ్ పై విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ ఇటీవలే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. పూజా, మహేష్ సరసన నటిస్తోంది.