ఘనంగా ఏఆర్ రెహమాన్ కూతురు పెళ్లి..
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంత పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన పెద్ద కూతురు ఖతీజా రెహజాన్ వివాహం రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే సౌండ్ ఇంజనీర్‌తో అంగరంగ వైభవంగా జరిగాయి. తన పెళ్లి ఫోటోలను స్వయంగా ఖతీజా షేర్ చేస్తూ.. “మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈరోజు కోసం ఎంతో ఎదురుచూశాను” అంటూ పోస్ట్ చేసింది. రెహమాన్ కూడా నూతన జంటను దీవించాలంటూ కోరారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ పలు చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.