జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్(ounch prasad) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పంచ్ లు ఎంత ఫేమసో.. ఆయనకున్న కిడ్నీ సమస్య కూడా అంతే ఫేమస్.
జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్(ounch prasad) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పంచ్ లు ఎంత ఫేమసో.. ఆయనకున్న కిడ్నీ సమస్య కూడా అంతే ఫేమస్. తన కిడ్నీ సమస్యపై తానే జోకులు వేసి నవ్విస్తున్నాడు పంచ్ ప్రసాద్. ఆయనకు రెండు కిడ్నీలు పాడైపోయిన విషయం తెల్సిందే. ప్రసాద్ భార్య కిడ్నీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నా కూడా ఆ ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చు అవుతుందని, దానికి దాతలు ఎవరైనా సాయం జబర్దస్త్ నటులు నూకరాజు(nukaraju), ఇమ్మానియేలు సోషల్ మీడియా లో అర్దించిన విషయం తెల్సిందే. ఇక ఇదే సమయంలో మంత్రి రోజా(minister roja) ఈ వ్యవహారాన్ని సీఎం జగన్(cm jagan) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పుడు పంచ్ ప్రసాద్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్..చికిత్స కు పూర్తి సహకారం లభించనుంది.
సీఎం రిలీఫ్ ఫండ్(ap cmo) నుంచి పంచ్ ప్రసాద్ చికిత్సకు కావాల్సిన ఆర్ధికసాయంను అందించారు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్‌కి యశోద ఆసుపత్రిలో వైద్య సేవల్ని అందిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం ఖర్చుల్ని భరిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక దీంతో నెటిజన్లు ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కిడ్నీమార్పిడి ఆపరేషన్ జరగనుందని సమాచారం. ఈ ఆపరేషన్ జరిగితే పంచ్ ప్రసాద్ కోలుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.