Anu Emmanuel:హాలీవుడ్ టు బాలీవుడ్..ఆ తరువాత కోలీవుడ్‌లో ప్రధానంగా వినిపించింది కాస్టింగ్ కౌచ్. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ సాఫీగా సాగిపోవాలంటే సర్ధుకు పోవాల్సిందే అనే మాట ఆ మధ్య ఉత్తరాదితో పాటు దక్షిణాది ఇండస్ట్రీలని ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై బాలీవుడ్ హీరోయిన్లు తనుశ్రీ దత్తా, మీరా చోప్రా, కంగన రనౌత్, ప్రియాంక చోప్రా వంటి క్రేజీ స్టార్స్ సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత కాస్టింగ్ కౌచ్ వివాదం సద్దుమనగడం తెలిసిందే.
Anu Emmanuel:హాలీవుడ్ టు బాలీవుడ్..ఆ తరువాత కోలీవుడ్‌లో ప్రధానంగా వినిపించింది కాస్టింగ్ కౌచ్. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ సాఫీగా సాగిపోవాలంటే సర్ధుకు పోవాల్సిందే అనే మాట ఆ మధ్య ఉత్తరాదితో పాటు దక్షిణాది ఇండస్ట్రీలని ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై బాలీవుడ్ హీరోయిన్లు తనుశ్రీ దత్తా, మీరా చోప్రా, కంగన రనౌత్, ప్రియాంక చోప్రా వంటి క్రేజీ స్టార్స్ సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత కాస్టింగ్ కౌచ్ వివాదం సద్దుమనగడం తెలిసిందే. అయితే తాజాగా మరో సారి దక్షిణాదిలో కాస్టింగ్ కౌచ్ వివాదంపై హీరోయిన్లు స్పందిస్తున్నారు.
దీంతో ఈ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ అను ఇమ్మానుయేల్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. మలయాళ ఇండస్ట్రీలో `స్వప్న సంచారి` సినిమాతో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన అను ఇమ్మానుయేల్ ఆ తరువాత `ప్రేమమ్` ఫేమ్ నివీన్ పాలి హీరోగా నటించిన `యాక్షన్ హీరో బీజు`తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. 2016లో విడుదలైన ఈ సినిమా అనుకు అక్కడ మంచి పేరు తెచ్చి పెట్టింది. హీరోయిన్గా క్రేజీ ఆఫర్లని అందించింది.
ఈ సినిమాతో తెలుగులో నాని హీరోగా నటించిన `మజ్ను`తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో ఆకట్టుకున్న అను వరుసగా స్టార్ హీరోలు అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ సినిమాలతో పాటు రాజ్ తరుణ్తోనూ నటించి ఆకట్టుకుంది. ఆ వెంటనే కోలీవుడ్‌లోనూ పరిచయమై అక్కడ వరుస క్రేజీ సినిమాల్లో నటించింది. విశాల్‌తో `డిటెక్టీవ్`, శివ కార్తికేయన్‌తో `వమ్మవీట్టు పిళ్లై` వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కార్తి హీరోగా రూపొందుతున్న `జపాన్`లో నటిస్తోంది. తెలుగులో ఒక్క సినిమా కూడా అను చేతిలో లేదు. చేతిలో ఉన్న తమిళ సినిమా `జపాన్`పైనే ఆశలు పెట్టుకుంది.
త్వరలో రిలీజ్‌కు ఈ సినిమా రెడీ అవుతున్న నేపథ్యంలో అను ఇమ్మానుయేట్ కాస్టింగ్ కౌచ్‌పై తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే వాటిని తన కుటుంబ సభ్యుల సహకారంతో ఎదుర్కొన్నానని, ఇలాంటి సందర్భాల్లో సమస్యని ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదని తెలిపింది. దీంతో అను ఇమ్మానుయేల్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అను ఇమ్మానుయేల్ ని ఆ కోరిక కోరింది ఎవరు? ..ఏ ఇండస్ట్రీకి చెందిన వారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.