NTR Centenary:స్వర్గీయ నందమూరి తారక రామారావు (N.T.Ramarao) శత జయంతి వేడుక(Centenary)లని ఎన్టీఆర్(NTR) అభిమానులు, కుటుంబ సభ్యులు ఏడాది పాటు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
NTR Centenary:స్వర్గీయ నందమూరి తారక రామారావు(N.T.Ramarao) శత జయంతి వేడుకలని ఎన్టీఆర్(NTR) అభిమానులు, కుటుంబ సభ్యులు ఏడాది పాటు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విజయవాడలోని పోరంకి గార్డెన్స్‌లో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు. తాజాగా మే 20 శనివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌పీలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో శత జయంతి వేడుకలని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కొన్ని గంటల్లో వేడుకలు ప్రారంభం కారనున్నాయి.
ఈ శత జయంతి వేడుకల్లో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టార్లు, రాజకీయ ప్రముఖులు భారీ స్థాయిలో హాజరు కానున్నారు. చాలా మందికి ఆహ్వానాలు పంపించారు. టాలీవుడ్ నుంచి పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ హాజరు కానున్నారని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. వారికి వేడుకల కమిటీ చైర్మన్ జనార్ధన్ ఆహ్వానాలు కూడా అందించారు. అయితే ఇందులో హీరో ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాల వల్ల, ఇదే రోజు ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో శత జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనలేకపోతున్నానని, ఈ విషయాన్ని ఆహ్వానం అందించిన రోజే నిర్వాహకులకు తెలియజేశానని స్పష్టం చేశారు.
దీంతో ఎన్టీఆర్‌ని శత జయంతి వేడుకల్లో చూడాలని ఆశగా ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులు, రామారావు ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే మెగా హీరో అల్లు అర్జున్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం లేదని తెలిసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుకల్లో పాల్గొనడం లేదని తాజాగా ఆయన టీమ్ వెల్లడించింది. ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా `ఎన్నీఆర్ శత జయంతి వేడుకల్లో బన్నీ పాల్గొంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన టీమ్ సమాధానం చెప్పింది.
బన్నీ `పుష్ప 2` షూటింగ్ లో బిజీగా ఉన్నందున ఎన్టీఆర్ వేడుకల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న `పుష్ప 2` షూటింగ్ తాజా షెడ్యూల్ ఇటీవలే మారేడుమిల్లిలో పూర్తయింది. ఫహద్ ఫాజిల్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలని అక్కడ పూర్తి చేశారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్న టీమ్ బన్నీకి సంబంధించిన సీన్ల కోసం మళ్లీ మారేడుమిల్లి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే బన్నీ.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కాలేకపోతున్నారట.