RRR: తగ్గేదేలే.. మరో అవార్డు అందుకున్న కీరవాణి
Another Prestigious Award For RRR: అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ తన సత్తా చూపిస్తోంది. ఇప్పటికే `నాటు నాటు..` సాంగ్ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకోవడంతో ఆర్ఆర్ఆర్ పేరు, కీరవాణి, రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది. ఇక తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును ఆర్ఆర్ఆర్ కైవసం చేసుకొంది. “లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసింది. ఇక SS రాజమౌళి పీరియడ్ ఫిల్మ్ RRR ఇంటర్నేషనల్ ప్రెస్ అకాడమీ గౌరవ శాటిలైట్ అవార్డును అందజేశారు. ఈ విషయాన్నీ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక ఇదే ఊపులో ఆస్కార్ ను కూడా కొట్టి తీసుకొచ్చేయాలని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఒకే ఒక్క సినిమా ప్రపంచ స్థాయిలో తెలుగును నిలబెట్టింది. ఎన్నో అవార్డులను అందుకొంటుంది. ఇక ముందు ముందు మరిన్ని అవార్డులను అందుకొనే ఛాన్స్ ఉంది. దీనంతటికి కారణం రాజమౌళి. ఆయనే కనుక లేకపోతే ఇండియా పేరు అక్కడ వినిపించేది కాదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఆస్కార్ కూడా వస్తే ఇక అంత చాలని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఆస్కార్ లో ఆర్ఆర్ఆర్ ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.