Anger Tales: ఆకట్టుకొంటున్న యాంగర్ టేల్స్ టీజర్
Anger Tales Teaser Out: ప్రస్తుతం థియేటర్ లో కంటే ఓటిటీ లో సినిమాలు చూడడానికే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. సినిమా ఎంత హిట్ అందుకున్నా చివరికి వహ్హేది ఓటిటీకే కాబట్టి ఇక్కడకు వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు కానీ థియేటర్ కు మాత్రం వెళ్లడం లేదు. ఇక ప్రేక్షకుల ఆసక్తిని తెలుసుకున్న డైరెక్టర్స్ సైతం .. కొత్త కథలను ఓటిటీలో వదులుతూ అభిమానులకు దగ్గరా అవుతున్నారు. ఇపప్టికే ఓటిటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాల కంటే మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక తాజాగా మరో వెబ్ సిరీస్ ఓటిటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది.
వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్. ప్రభాల తిలక్ దర్శకత్వం వహించగా శ్రీధర్ రెడ్డి, కలర్ ఫోటో నటుడు సుహాస్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైలాగ్స్ లేకుండా సైగిన ఈ టీజర్ ఎంతో ఆసక్తిని రేపుతోంది. టీజర్ లో పూజా..రాధ.. గిరీలను పరిచయం చేశారు. ఈ నలుగురు మధ్య సాగే కథగా చూపించారు. ఇందులో యువ దర్శకుడు వెంకటేష్ మహా ప్రధాన పాత్రలో రంగా గా నటించాడు. మోడ్రన్ యువతి పూజాగా మడోన్నా సెబాస్టియన్ కనిపించగా గృహిణి రాధగా బిందు మాధవి కనిపిస్తోంది. వీరి నలుగురు జీవితాలకు కనెక్షన్ ఏంటి..? అసలు ఒకరి కథలోకి మిగతావారు ఎలా వచ్చారు..? అనేది సిరీస్ చూస్తే కానీ తెలియదు. కొత్త తరహా కథతో రూపొందిన ఈ సిరీస్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ సిరీస్ తో ఈ చిత్ర బృందం ఎలాటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.