Anasuya:సోషల్ మీడియాలో రంగమ్మత్త అనసూయ(Anasuya) చేసే హంగామా అంతా ఇంతా కాదు. తనకు సంబంధం లేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఆకారణంగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతూ ఉంటుంది.
Anasuya:సోషల్ మీడియాలో రంగమ్మత్త అనసూయ(Anasuya) చేసే హంగామా అంతా ఇంతా కాదు. తనకు సంబంధం లేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఆకారణంగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతూ ఉంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్ లకు సంబంధించిన ఫొటోలని అభిమానులతో పంచుకునే అనసూయ సామాజిక అంశాలపై కూడా పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ చేత చీవాట్లు తిన్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `ఖుషీ` మూవీ పోస్టర్‌పై `ది విజయ్ దేవరకొండ` అని ఉండటం, దాన్ని కోట్ చేస్తూ `ఏంటో పైత్యం` అంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా `ది విజయ్ దేవరకొండ` అంటూ సపోర్ట్ చేయడంతో `నా ఒక్కదాని కోసం ఇంత మందా?` అని మరోసారి ట్వీట్ చేసి సైలెంట్ అయిపోయింది. దీంతో అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వివాదానికి తెర పడింది.
ఎవరెన్ని చెప్పినా.. ఎంతగా విమర్శలు చేసినా తనకు నచ్చినట్టే ఉంటానంటూ స్టేట్మెంట్లు ఇస్తున్న అనసూయ వీకెండ్ ని మాత్రం ఫ్యామిలీతో కలిసి ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి అనసూయ భర్త, పిల్లలతో కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనసూయ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌కు వెళ్లింది. స్విమ్మింగ్ పూల్‌లో భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసింది.
Anasuya 3
ఆ ఫొటోలని షోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. తొలిసారి అనసూయ బికినీలో కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. సండే అనసూయ తన బికినీ అవతార్‌తో హాట్ పెంచేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్గా `మైఖేల్`, రంగమార్తాండ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం `పుష్ప 2`తో పాటు `విమానం`, ఫ్లాష్ బ్యాక్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇవి త్వరలోనే విడుదల కానున్నాయి.
Anasuya 1
Anasuya 2
Anasuya 4