Amitabh bachchan:బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అరెస్ట్.. బిగ్ బి అరెస్ట్ ఏంటీ?.. అసలు ఏం జరిగింది?.. అన్నది ఆసక్తికరంగా మారింది.
Amitabh bachchan:బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అరెస్ట్.. బిగ్ బి అరెస్ట్ ఏంటీ?.. అసలు ఏం జరిగింది?.. అన్నది ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే…ఇటీవల ఓ షూటింగ్లో పాల్గొనడం కోసం అమితాబ్ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు. ముంబైలో ట్రాఫిక్ కష్టాలు ఎదురవ్వడంతో షూటింగ్ లొకేషన్‌కు చేరుకోవాలనే భావనతో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై షూటింగ్ లొకేషన్‌కు వెళ్లానని, అతనెవరో తనకు తెలియదని, అయితే అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలని తెలుపుతూ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో అమితాబ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది మర్చిపోకముందే తాజాగా తాను అరెస్ట్ అయ్యానంటూ షాకిచ్చి మరో సారి వార్తల్లో నిలిచారు అమితాబ్. ఇంతకీ అమితాబ్ అరెస్ట్ కావడం ఏంటీ? .. ముంబై పోలీస్ జీప్ పక్కన ఎందుకు నిలబడి ఉన్నారు. ఇంతకీ ఏం జరిగింది? అన్నది ఆసక్తికరంగా మారింది. అమితాబ్ షేర్ చేసిన ఫొటోని, పోస్ట్‌ని చూసిన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు ఇలాంటి పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌ని ఆటపట్టిస్తున్నారు.
అందులో భాగంగానే అమితాబ్ ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది. అమితాబ్ ప్రస్తుతం `గూమర్, ది ఎమేష్ క్రానికల్స్ తో పాటు తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న `ప్రాజెక్ట్ కె`లో నటిస్తున్నారు. హిందీ సినిమా `గూమర్` లోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోనే అమితాబ్ తాజాగా షేర్ చేసి అరెస్ట్ అంటూ ట్విస్ట్ ఇచ్చారని, ఇదంతా ఆ సినిమా పబ్లిసిటీ కోసమేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అమితాబ్ `అరెస్ట్` అంటూ సీరియస్‌గా పోలీస్ జీప్ పక్కన నిలబడి ఉన్న ఫొటోని ఎందుకు షేర్ చేశారు? దఆని వెనకున్న కథేంటన్నది స్వయంగా ఆయన క్లారిటీ ఇస్తే కానీ ఈ సస్పెన్స్ కు తెరపడదు.