హీరో నవదీప్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ కు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మధ్య స్నేహ బాదం ఎలాంటిదో అందరికి తెల్సిందే. వీరిద్దరూ కలిసి ‘ఆర్య 2’ లో నటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగుతూ ఉంది. ముద్దుగా ఇద్దరు బావ, బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా నవదీప్ కు అల్లు అర్జున్ కాస్ట్లీ గిఫ్ట్ ను ప్రజెంట్ చేశాడు. ఈ విషయాన్ని నవదీప్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. బ్రాండెడ్ ఎయిర్ పాడ్స్. “ప్రేమకు అవధులు లేనప్పుడు, బహుమతులు సందర్భానుసారంగా ఉంటాయి. ధన్యవాదాలు, బావ్స్ అల్లు అర్జున్. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ తో ఎయిర్ పాడ్స్ వాడతా” అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మీ ఇద్దరి స్నేహ బంధం ఎప్పుడు ఇలాగె కొనసాగాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.