Allu Arjun : మరో అరుదైన రికార్డ్ ను కొట్టేసిన పుష్ప రాజ్
Allu Arjun Is The Top Most-Followed South Celebrities In Instagram: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సౌత్ ఇండియన్ హీరోల్లో అత్యధిక ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ నిలిచాడు. మొన్నటివరకు 19.8 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న బన్నీ తాజాగా రౌండ్ ఫిగర్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం 20మిలియన్ ఫాలోవర్స్ తో బన్నీ తాన్ ఇన్స్టాగ్రామ్ కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటివరకు ఇంతమంది ఫాలోవర్స్ ఏ సౌత్ హీరోకు లేకపోవడం విశేషం.
పుష్ప కు ముందు బన్నీ ఫాలోవర్స్ 14మిలియన్ల వరకు మాత్రమే ఉండేవారు. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో ఆయన ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు. 20 మిలియన్స్ ఫాలోవర్స్ అంటే మాటల్లో చెప్పేంత ఈజీ కాదు. తన అభిమానులను ఎప్పటికప్పుడు బన్నీ సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. దీంతో బన్నీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మరి పుష్పతో వచ్చిన ఈ క్రేజ్.. పుష్ప 2 కు ఉంటుందా..? పార్ట్ 2 తో బన్నీ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.